Monday, September 26, 2022

మెగాస్టార్ చిరంజీకి షాక్ ఇవ్వబోతున్న యాంకర్ అనసూయ భరద్వాజ్

Must Read

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా వెలుగొందుతున్నారు. అందులో కొందరు అందంతో ప్రేక్షకులను మాయ చేస్తుండగా.. మరికొందరు మాత్రం అద్భుతమైన హోస్టింగ్‌తో అలరిస్తున్నారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే ఆ రెండూ కలగలిపి కనిపిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆకట్టుకునే అందం.. అదిరిపోయే టైమింగ్‌తో ఈమె సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోంది. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటూ టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోంది.

చాలా ఏళ్లుగా యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అనసూయ భరద్వాజ్.. ఆ మధ్య సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులోనూ తనదైన శైలి నటనతో పాటు గ్లామర్ ట్రీట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా ఎన్నో మంచి మంచి రోల్స్‌ను చేసింది. దీంతో వరుస పెట్టి ఎన్నో మూవీ ఆఫర్లను చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అనసూయ.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో ఆమె పాత్ర గురించి ఓ న్యూస్ లీకైంది.

‘గాడ్ ఫాదర్’ మూవీలో అనసూయ.. చిరంజీవి చెల్లెలిగా నటిస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుందట. లూసీఫర్ మూవీలో ఓ అమ్మాయి ఒకరి చేతిలో మోసపోయి తల్లి అవుతుంది. ఆమెను హీరో ఆదుకుంటాడు. ఎంతో అమాయకంగా ఉండే ఆ అమ్మాయి.. తన బిడ్డకు తండ్రి హీరోనే అని పోలీసులను ఆశ్రయిస్తుంది. దీంతో అతడిపై కేసు నమోదు అవడంతో పాటు కథ మలుపు తిరుగుతుంది. ఇప్పుడీ పాత్రనే అనసూయ చేస్తుందట. దీంతో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img