Sunday, December 4, 2022

తొలిసారి అలా కనిపించబోతున్న యాంకర్ అనసూయ భరద్వాజ్

Must Read

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా.. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను అందుకున్న వారిలో ప్రముఖ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయిన ఈ అమ్మడు.. తన అందంతో పాటు హోస్టింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో కెరీర్ ఆరంభంలోనే ఎన్నో షోలలో కనిపించి హవాను చూపించింది. దీంతో బుల్లితెరపై అనసూయ కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది.

సుదీర్ఘ కాలం పాటు తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి నటనతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘పుష్ప’, ‘థ్యాంక్యూ బ్రదర్’ సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. తద్వారా విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు, వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ అనసూయ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.

అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో ‘ఖిలాడీ’ ఒకటి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అనసూయ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఆమె డుయల్ రోల్ చేస్తుందట. అందులో ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ కాగా.. రెండోది బోల్డు రోల్ అని అంటున్నారు. దీంతో ఆమె కెరీర్‌లోనే ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలవబోతుందనే టాక్ వినిపిస్తోంది.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

1xbet App India Evaluate

1xbet App India Evaluate Great incentives, promotions and a loyalty plan are ready for model new gamblers. 1xbet using the...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img