బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన కొత్త సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా అప్ డేట్స్ రవితేజ, మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ బాబీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సినిమాలో రవితేజ రోల్, ఆయన్నే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని బయటపెట్టారు. రవితేజను తీసుకోవాలనే ఛాయిస్ తనదే అని చెప్పిన బాబీ.. ఆ మాట చెప్పగానే చిరంజీవి కూడా మరో ఆలోచన లేకుండా ఓకే అన్నారని తెలిపారు. ఆ తర్వాత రవితేజను సంప్రదించగా.. చిరంజీవిపై ఉన్న ప్రేమ అభిమానంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు బాబీ. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య సినిమా లేదని చెప్పిన ఆయన.. జనవరి 13వ తేదీన ఈ సినిమా చూడగానే ఆ విషయం మీకే తెలుస్తుందని చెప్పడం విశేషం.
మాస్ కమర్షియల్ అంశాలతో ఈ వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అన్ని హంగులతో రూపొందిన ఈ సినిమాను జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.