Saturday, December 3, 2022

అతడు నాకు తాళి కట్టిన భర్త: బిగ్ బాస్‌ షోలో బాంబ్ పేల్చిన అషు రెడ్డి

Must Read

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తెలుగు అమ్మాయిలు విపరీతంగా పాపులర్ అయ్యారు. అందులో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండే ఈ అమ్మడు.. చాలా కాలం క్రితమే ఫేమస్ అయింది. దీంతో చాలా అవకాశాలను కూడా అందుకుంటోంది. మరీ ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం వచ్చిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన అషు రెడ్డి.. అందులో అందంతో పాటు అదిరిపోయే ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించింద. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంది. ఫలితంగా ఆఫర్లను దక్కించుకుంటోంది.

తెలుగులో బిగ్ బాస్ షో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఐదు సీజన్లను ఇది సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు ఇటీవలే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ మొదటి సీజన్‌ను ప్రారంభించారు. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24 గంటల పాటు ప్రసారం అవుతోంది. మొత్తం 84 రోజుల పాటు సాగనున్న ఈ సీజన్‌లోకి అషు రెడ్డి కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులో ఆమె చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. సెన్సార్ లేకపోవడంతో మరింత బోల్డుగా వ్యవహరిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో మాజీ కంటెస్టెంట్లను వారియర్స్‌గా, కొత్త వాళ్లను చాలెంజర్స్‌గా విభజించిన విషయం తెలిసిందే. ఇందులో ఒక టాస్కులో సీనియర్లు గెలిచారు. దీంతో జూనియర్లకు టాస్క్ ఇచ్చే అవకాశం దక్కింది. ఇందులో భాగంగానే అషు రెడ్డి.. అజయ్‌ను ‘నువ్వు నాకు తాళి కట్టిన భర్తవు.. నా చెల్లి (ఆరియానా)కి లైన్ వేయాలి’ అనే టాస్క్ ఇచ్చింది. దీంతో అతడితో పాటు అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఈ కుర్రాడు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో రచ్చ చేశాడు. అందుకు అనుగుణంగానే అషు రెడ్డి, ఆరియానా రెచ్చిపోయారు.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

1xbet App India Evaluate

1xbet App India Evaluate Great incentives, promotions and a loyalty plan are ready for model new gamblers. 1xbet using the...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img