Monday, September 26, 2022

ఇద్దరు బిడ్డల తల్లివి అలాంటి పనులు చేస్తావా: అనసూయపై నెటిజన్ ఫైర్

Must Read

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతూ టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా అనసూయ హవాను చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె భారీ చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటోంది. తద్వారా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతూ రెండు చేతులా సంపాదిస్తూ ముందుకు సాగుతోంది.

ఒకవైపు షోలు.. మరోవైపు సినిమాలు చేసుకుంటూ తెగ సందడి చేస్తోన్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన చాలా విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే అనసూయ.. పొట్టి బట్టలు వేసుకుని దిగిన ఓ ఫొటోషూట్‌ను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. అదే సమయంలో వీటిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

అనసూయ స్కిన్ షో చేస్తూ దిగిన ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ‘అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’ అంటూ వివాదాస్పదంగా కామెంట్ చేశాడు. దీంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. ఆ వెంటనే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌నే ట్విట్టర్‌లో షేర్ చేసి ‘దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అంటూ గట్టి రిప్లై ఇచ్చింది. ఇలా ఆమె ఎంతో మంది నోర్లు మూయించేసింది.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img