Monday, September 26, 2022

రామ్ చరణ్ – ఉపాసన పర్సనల్ వీడియో వైరల్.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి

Must Read

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ సక్సెస్‌లను చూసిన అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR అనే చిత్రంలో నటించాడు. అలాగే, ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న ఓ మూవీలోనూ నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న రామ్ చరణ్.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత పెద్దల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఇక, వివాహం తర్వాత కూడా వీళ్లిద్దరూ తమ తమ రంగాల్లో రాణిస్తూ ఎప్పుడూ ఫుల్ బిజీగా గడుపుతుంటారు. ఖాళీ సమయాల్లో మాత్రం హాలీడే ట్రిప్పులకు వెళ్లి చరణ్, ఉపాసన తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీళ్లిద్దరూ ఫారెన్ ట్రిప్ వెళ్లిన విషయం తెలిసిందే.

ఇటీవలే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఫిన్‌లాండ్ వెళ్లాడు. అక్కడ గట్టకట్టే చలిలో వీళ్లిద్దరూ బస చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక, తాజాగా ఈ జంట ఆ దేశంలో ఎంజాయ్ చేసిన ఓ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో చరణ్‌ను ఉపాసన ట్రాలీ మీద కూర్చోబెట్టి ఎయిర్‌పోర్టులో తిప్పడం.. గడ్డకట్టిన నీటిలో బోటింగ్ చేయడం.. రూమ్‌లో చలికాగుతుండడం.. మంచు కురుస్తోన్న సమయంలో కలియ తిరగడం వంటివి చూపించారు. దీంతో ఈ వీడియో తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయిపోయింది.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img