Monday, September 26, 2022

RRR Movie Collection: పది రోజుల్లోనే 900 కోట్లు.. టాలీవుడ్‌లో రికార్డు

Must Read

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే స్టామినా గతంతో పోలిస్తే ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పాలి. దీనికి కారణం కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘బాహుబలి’ మూవీనే అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతటి గొప్ప సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్‌ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది అదిరిపోయే రెస్పాన్స్‌తో సాగుతోంది.

తారక్, చరణ్ కాంబోలో రూపొందిన RRR మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 451 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం పది రోజుల్లో నైజాంలో రూ. 97.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 44.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 30.05 కోట్లు, ఈస్ట్‌లో రూ. 13.75 కోట్లు, వెస్ట్‌లో రూ. 11.60 కోట్లు, గుంటూరులో రూ. 16.31 కోట్లు, కృష్ణాలో రూ. 12.98 కోట్లు, నెల్లూరులో రూ. 7.95 కోట్లు, కర్నాటకలో రూ. 37.15 కోట్లు, తమిళనాడులో రూ. 33.70 కోట్లు, కేరళలో రూ. 9.25 కోట్లు, హిందీలో రూ. 91.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 84.20 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ. 496.80 కోట్లు షేర్‌, రూ. 900 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

RRR మూవీకి రూ. 451 కోట్ల బిజినెస్ జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లు అయింది. ఇక, ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 496.80 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు అప్పుడే ఈ చిత్రానికి రూ. 43.80 కోట్ల లాభాలను కూడా సొంతం అయ్యాయి. ఇలా తక్కువ సమయంలోనే ఇన్ని కోట్లు వసూలు చేసి ఈ చిత్రం రికార్డు నెలకొల్పింది.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img