Monday, September 26, 2022

నాగ చైతన్యతో కలవబోతున్న సమంత.. ఆమె కోరడంతో మరోసారి జంటగా!

Must Read

సినీ రంగంలో ప్రేమాయణాలు సాగించడం.. ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకోవడం.. మనస్పర్థలతో విడిపోవడం అనేవి సర్వసాధారణంగా జరిగే విషయాలే. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చాలానే చూశాం. అంతెందుకు గత ఏడాదే స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య.. సమంత తమ నాలుగేళ్ల వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. అంతేకాదు, వీళ్లిద్దరూ తమ తమ జీవితాలకు కొత్త దారులు వెత్తుకునే చర్యల్లో భాగంగా.. మధుర జ్ఞాపకాలను కూడా చెరిపేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చై సామ్ మరోసారి కలవబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విడాకుల తర్వాత వీళ్లిద్దరి కెరీర్‌లు మరింత స్పీడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని కొత్త సినిమాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైతూ, సామ్‌ను కలపడానికి ఓ లేడీ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తుందట. అయితే, ఇది నిజ జీవితంలో మాత్రం కాదండోయ్. కేవలం ఆమె రూపొందించబోయే సినిమా కోసం మాత్రమే. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అనే కదా మీ సందేహాం. ఆమెనే వీళ్లిద్దరి క్లోజ్ ఫ్రెండ్ అయిన నందినీ రెడ్డి.

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి ముందు నందినీ రెడ్డి వీళ్లిద్దరికీ కలిపి ఓ కథను రెడీ చేసింది. ఇది వీళ్లకు ఎంతగానో నచ్చేసింది. అయితే, అంతలోనే బ్రేకప్ అయిపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే నందినీ వీళ్లిద్దరితో సినిమాకు సంబంధించిన చర్చలు జరిపిందట. దీంతో ఇందులో నటించేందుకు ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అదే జరిగితే చై సామ్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. గతంలో వీళ్లిద్దరూ ఏమాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img