Monday, September 26, 2022

బాలీవుడ్ హీరో ఇంటికి సమంత: అక్కడే అన్ని గంటల పాటు ఎందుకుందంటే!

Must Read

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. ‘ఏమాయ చేశావే’ సినిమా నుంచి ప్రేక్షకులను మా చేస్తోన్న ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. దీంతో ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక, నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత మరింత స్పీడుగా సినిమాలను ఒప్పుకుంటోన్న సామ్.. ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలోనే తాజాగా ఈ అమ్మడు ముంబై నగరంలో ప్రత్యక్షం అయింది.

సమంత రూత్ ప్రభు రెండు రోజుల క్రితమే ముంబైకు పయనం అయింది. అక్కడకు ఎందుకు వెళ్లిందో తెలియదు కానీ, బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి కెమెరాల కంటికి చిక్కింది. ఆ సమయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవగా.. సదరు హీరోనే ఆమెను సేఫ్‌గా కారు కూడా ఎక్కించాడు. ఆ తర్వాత సామ్.. వరుణ్ ఇంటికి వెళ్లినట్లు ఓ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి త్వరోలనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుండడమే అని బీ టౌన్ వర్గాల సమాచారం. దీనికోసం వర్క్‌షాప్ చేయడానికి ఇద్దరూ కలిశారని అంటున్నారు.

గత ఏడాది సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన దీన్ని మన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే రూపొందించారు. ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు సమంతకు మంచి పేరును తెచ్చింది. ఇక, ఇప్పుడు ఇదే దర్శకులు మరో వెబ్ సిరీస్‌ను తీస్తున్నారట. ఇందులో వరుణ్ ధావన్ – సమంత జంటగా నటిస్తున్నారని అంటున్నారు. దీనికోసమే వీళ్లిద్దరూ ముంబైలో కలుసుకున్నారని, వీళ్లతో పాటు రాజ్ అండ్ డీకే కూడా ఉన్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img