Monday, September 26, 2022

పెళ్లికి ముందు బిగ్ బాస్ జంట బ్రేకప్: వేరు వేరుగా పోస్టులు చేయడంతో క్లారిటీ

Must Read

బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువగా మారి.. భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఆంగ్ల రియాలిటీ షో ద్వారా హిందీలో పరిచయమైన దీనికి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో అక్కడ ఈ కార్యక్రమం ఏకంగా పదిహేను సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో కొందరు జంటలుగానూ ఫేమస్ అయ్యారు. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును కూడా దక్కించుకున్నారు. అలాంటి వారిలో షమితా శెట్టి – రాకేశ్‌ బాపత్‌ జోడీ ఒకటి.

గత ఏడాది హిందీలో ప్రసారం అయిన బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్లుగా వచ్చిన వీళ్లిద్దరూ.. చాలా తక్కువ సమయంలోనే స్నేహితులుగా మారిపోయారు. అలా క్రమంగా మరింత చనువు ఏర్పరచుకున్నారు. ఇలా ఈ సీజన్ నడిచే క్రమంలో వీళ్లిద్దరూ ప్రేమ పక్షుల్లా మారిపోయారు. దీంతో తరచూ హగ్స్ చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం చేసేవారు. మొత్తంగా షో అయ్యేంత వరకూ జంటగానే సందడి చేసి హైలైట్ అయ్యారు. ఇక, బయటకు వచ్చిన తర్వాత కూడా షమితా శెట్టి – రాకేశ్‌ బాపత్‌ జంటగానే కనిపిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత షమితా శెట్టి – రాకేశ్‌ బాపత్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తరచూ జంటగా కెమెరాల కంటికి చిక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంట విడిపోతుందని ఓ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా షమితా శెట్టి దీనిపై స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు’ అంటూ ఓ పోస్ట్ చేసింది. అలాగే, రాకేశ్‌ బాపత్‌ కూడా ‘పుకార్లు నమ్మకండి’ అంటూ పోస్ట్ పెట్టాడు. తద్వారా బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img