Monday, September 26, 2022

స్టార్ హీరోయిన్ కూతురితో విజయ్ దేవరకొండ రొమాన్స్

Must Read

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలంగా సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. అయినప్పటికీ హవాను మాత్రం చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయ్.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ వచ్చే ఆగస్టులో విడుదల కాబోతుంది.

‘లైగర్’ మూవీ పట్టాలపై ఉండగానే విజయ్ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో అతడి సినిమా ఓకే అయిపోయిన విషయం తెలిసిందే. అలాగే, శివ నిర్వాణతో కూడా ఓ సినిమాను అనుకున్నా.. అది ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్.. మరోసారి పూరీ జగన్నాథ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇది గతంలో మహేశ్ బాబు కోసం రాసుకున్న ‘జగ గణ మన’ స్కిప్టుతో రాబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ‘జగ గణ మన’ మూవీని పూరీ జగన్నాథ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఈ స్క్రిప్టును పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా వినిపించాడు. కానీ, ఎందకనో ఆయన కూడా ఇది చేయడానికి ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌తో ఈ సినిమా చేయాలని పూరీ డిసైడ్ అయ్యాడట. అంతేకాదు, ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను కూడా తీసుకున్నారని అంటున్నారు. లైగర్ మూవీ విడుదల కావడానికి ముందే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేస్తారని సమాచారం.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img