Monday, September 26, 2022

మల్లాపూర్‌లో చేవూరి వారి మహా అన్నదాన కార్యక్రమం

Must Read

అన్నం పరబ్రహ్మ స్వరూపం. జీవి జీవన ప్రయాణంలో ఏది లోపించినా బ్రతకగలం కానీ.. ఆహారం లోపిస్తే బ్రతకలేం. అందుకే దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెబుతుంటారు పెద్దలు. ఎన్ని దానధర్మాలు చేసినా.. ఎవ్వరికి ఎన్ని ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ ఒక్క అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు ఇక చాలు అని చెప్పి సంతృప్తి చెందుతారు. అందుకే ఈ అన్నదానానికి ఎంతో విలువ. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవీయత చాటుకుంటూ ఉంటారు హైదరాబాద్ మల్లాపూర్‌కి (Mallapur) చెందిన శ్రీ చేవూరి ఉష శ్రీ గారు.

ఇదే బాటలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చేవూరి సుదర్శన్- అరుణ గారి కూతురు శ్రీ చేవూరి ఉష శ్రీ గారిచే మహాన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. స్థానిక మల్లాపూర్ లోని శ్రీ సీతారాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు పాల్గొనాల్సిందిగా చేవూరి సుదర్శన్, ఉష శ్రీ కోరుతున్నారు.

ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసే దానం చాలా అత్యున్నతమైనదని, అలాంటి వారికి మోక్షం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. ఆకలితో ఉన్న వారికి, పేదలకు, అనాదలకు, రోగులకు, వికలాంగులకు చేసే అనదానాలతో కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ‘పరమత’ భేదం లేకుండా చేవూరి వారు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ..

మీ Daily 6am న్యూస్ ప్రతినిధి సీతారామి రెడ్డి
ఎప్పటికప్పుడు లేటెస్ట్, సినీ, రాజకీయ, లోకల్ వార్తల కోసం చూస్తూ ఉండండి.. www.daily6am.com

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img