Monday, September 26, 2022

*మల్లాపూర్ నోమాకు ఎదురుగా ఉషోదయా సూపర్ మార్కెట్ పై అక్రమ అదనపు నిర్మాణాలు

Must Read

*150 ఫీట్ల ప్రధాన రహదారిని ఆనుకొని నిర్మించిన ఉషోదయా సూపర్ మార్కెట్ పై అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

*చుట్టూ పరదలు కట్టి రాత్రి వేళల్లో పనులు దర్జాగా నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని డైలీ 6amన్యూస్ ప్రతినిధి సీతారామిరెడ్డి స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం GHMC ఆఫీసర్స్ పనితీరుకు నిదర్శనం.

*ఇలాంటి వ్యాపార సముదాయాల నిర్మాణం వల్ల పార్కింగ్ సమస్య తలెత్తడం జరుగుతోంది. ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

*అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, GHMC అధికారులు తగిన చర్యలు తీసుకోకుండా కాసులకు కక్కుర్తి పడుతున్నట్లు తెలుస్తోంది.

*అక్రమ నిర్మాణం చేపడుతుండగా డైలీ 6amన్యూస్ మీడియాలో విజువల్స్‌తో కూడిన కథనాలు వచ్చినా స్థానిక జోనల్ ACP, DC ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో సదరు నిర్మాణం చకచకా పూర్తి చేస్తున్నారు. దీన్ని బట్టి బడా బాబులకు అధికారులు ఎలా కొమ్ము కాస్తున్నారో స్పష్టమవుతోంది.


*కేవలం 100 గజాల స్థలంలో నిర్మాణం చేసుకునే నిరుపేదను మాత్రం గద్దల్లా వెంటాడే అధికారుల పనితనం ఇలా అక్రమంగా నిర్మిస్తున్న పెద్ద నిర్మాణ సముదాయాల విషయంలో ఏమైనట్లు అని స్థానిక జనం ప్రశ్నిస్తున్నారు.

*ఇకనైనా సదరు నిర్మాణంపై వెంటనే చర్చలు తీసుకోవాలని జనం కోరుతున్నారు….. డైలీ 6amన్యూస్ ప్రతినిది సీతారామిరెడ్డి..

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img