మల్లాపూర్ చేవూరి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో గోకుల్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ మాత జగజ్జనని ముగ్గురమ్మల దేవాలయం ప్రాంగణంలో (temple name bord) ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ బోర్డును ఆలయం ఎదుట బిగించారు.
చేవూరి వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక నిలయం ఆధ్వర్యంలో ఉషా శ్రీ చేవూరి.. అమ్మవారి ఆలయంలో నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని ఆలయ కమిటీ సభ్యులు కొనియాడారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు చేవూరి అరుణ సుదర్శన్ లను
శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధిలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని చేవూరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు T. మల్కయ్య, శివరాం ప్రసాద్, A. వెంకట్ రెడ్డి, S. రాజు, శేఖర్ రావు, వెంకటేష్, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.