Monday, September 26, 2022

హైదరాబాద్ ప్లెస్ క్లబ్ ఎన్నికల్లో ‘డిజిటల్’ కింగ్.. ఆన్ లైన్ జర్నలిస్టుల సపోర్ట్

Must Read

రోజులు మారుతున్నాయి. పాత కాలం పోయి కొత్త కాలం వస్తోంది. కొత్త కొత్త టెక్నాలజీలు మార్కెట్‌లో వచ్చి ప్రపంచాన్ని డిజిటల్ దిశగా అడుగులు వేయిస్తున్నాయి. ఒకానొక సమయంలో ల్యాండ్ ఫోన్ ఉంటేనే మాహా గొప్ప.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి హై టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ వచ్చేశాయి. ఎక్కడో ఓ చోట ల్యాండ్ ఫోన్ కనిపిస్తున్నప్పటికీ మెల్లగా అవి కనుమరుగవుతున్నాయని చెప్పడంలో అనుమాన పడాల్సిన పని లేదు. దీనికి కారణం హై క్వాలిటీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడం. అయితే అదే టెక్నాలజీ బేస్ చేసుకొని పుట్టిందే ఆన్ లైన్ జర్నలిజం. అలాంటి జర్నలిస్టులకు ఓ గుర్తింపు రావాలనే సదుద్దేశంతో ముందుకొచ్చి లీడర్‌గా నిలిచారు బీఎస్ (బుర్రా శ్రీనివాస్).

పేపర్ చదివే రోజుల నుంచి క్రమంగా మొబైల్‌లో వార్తలు చదివే రోజులు వచ్చేశాయి. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ఆన్ లైన్ మీడియాలో వార్తలు చూస్తూ ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. క్షణాల్లో వార్త విశేషాలు చూస్తున్నారు. అది కూడా అరచేతిలో. ప్రింట్ మీడియా అయిన పేపర్, ఎలక్ట్రానిక్ మీడియా అయిన టీవీలతో పోల్చితే ఆన్ లైన్ మీడియా చాలా వేగవంతమైంది. డిజిటల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు క్షణాలతో పోటీపడి వార్తలు అందిస్తుంటారు. రాజకీయ, సామాజిక విషయాలతో పాటు ఈ ప్రపంచంలోని ఎన్నో తెలియని విషయాలపై విశ్లేషణలతో కూడిన వార్తలు, వీడియోలు ప్రసారం చేస్తుంటారు. మరి ఇలాంటి జర్నలిస్టులకు గుర్తింపు ఉండకపోతే ఎలా? అనుభవమున్న ఆన్ లైన్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్, ప్రెస్ క్లబ్ మెంబర్ షిప్స్ ఉండాలి కదా. ఆ ఆలోచనతోనే TUOWJ (తెలంగాణ ఆన్ లైన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్) అనే యూనియన్ స్థాపించి ఆన్ లైన్ జర్నలిస్టులను ఒక్కతాటిపైకి తెచ్చారు బీఎస్.

గతంలో పలు సంస్థల్లో పనిచేసి ఇప్పుడు ‘డిజిటల్ మీడియా’ కింగ్ అనిపించుకుంటున్న బీఎస్ (బుర్రా శ్రీనివాస్) ఇప్పుడు ప్రెస్ క్లబ్ EC మెంబర్‌గా పోటీ చేస్తున్నారు. అది కూడా మూసధోరణికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రెస్ క్లబ్‌లో డిజిటల్ మీడియా రంగం యొక్క ఉనికిని చాటి చెప్పడానికి. రెండేళ్ళకోసారి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం
బీఎస్ రూపంలో కొత్త శకానికి పునాది పడుతోంది.

ప్రింట్, ఎలక్ట్రానిక్ ఛానళ్ళలో పనిచేసే జర్నలిస్టులతో పోలిస్తే ‘భవిష్యత్ అంతా మాదే’ అంటూ ప్రెస్ క్లబ్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు బీఎస్. యూట్యూమ్, వెబ్ సైట్ మాధ్యమాల్లో పనిచేసే జర్నలిస్టులంటే చిన్నచూపు చూస్తున్నారు. అలాంటి  వెబ్ జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తా, ఆన్ లైన్ జర్నలిస్టులను ప్రెస్ క్లబ్‌లో భాగం చేస్తా అనే దృక్పథంతో ప్రెస్ క్లబ్ EC మెంబర్‌గా బీఎస్ పోటీ చేస్తున్నారు.

Bs with Sitaramireddy

పక్కా ప్రణాళికతో గెలుపే లక్ష్యంగా అడుగులేస్తున్న బుర్రా శ్రీనివాస్ (బీఎస్) కోసం ఆన్ లైన్ జర్నలిస్టులు కదలి వస్తున్నారు. ఆయన గెలవాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఈ రోజు TUOWJ (తెలంగాణ ఆన్ లైన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్) మెంబర్ అయిన K. సీతారామి రెడ్డి ప్రత్యేకంగా బీఎస్‌ని కలిసి ఆయన గెలుపును ఆకాక్షించారు. ఈ మేరకు తాను ప్రెస్ క్లబ్ EC మెంబర్‌గా గెలిస్తే ఆన్ లైన్ జర్నలిస్టుల సమస్యలు, గుర్తింపు కోసం పోరాడటమే గాక అర్హులైన ఆన్ లైన్ జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్‌లో మెంబర్ షిప్ ఇప్పిస్తానని మాటిచ్చారు బీఎస్. ప్రెస్ క్లబ్‌లో ఈ ఏడాది బీఎస్ రూపంలో ‘డిజిటల్’ మార్క్ కనిపించాలని పలువురు ఆన్ లైన్ జర్నలిస్టులు కోరుకుంటున్నారు.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img