Monday, September 26, 2022

7 రూపాయలు పెట్టండి.. 60 వేలు తీసుకోండి! సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అదుర్స్..

Must Read

మనిషి జీవన ప్రయాణంలో పొదుపు చేయడం అనేది ముఖ్యభాగం. ఎంత సంపాదించామన్నది లెక్క కాదు సంపాదించిన దాంట్లో ఏ మేర పొదుపు చేశామనేదే పాయింట్. ఈ నాటి పొదుపే రేపటి బలం. అయితే పొదుపు చేయడం కోసం ఎన్నో మార్గాలుంటాయి. పలు ప్రైవేట్ సంస్థల్లో ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. అయితే రాబడి అనేది మాత్రం కంపెనీ లావాదేవీలు, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మరి ఇలాంటివే గవర్నమెంట్ స్కీమ్స్ అయితే.. ఇక ఆలోచన ఎందుకులే అని జాయిన్ అయ్యేవారు బోలెడంతమంది.

అలాంటి ఓ ప్లాన్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఇందులో రోజుకు 7 రూపాయలు పెడితే సంవత్సరానికి 60 వేల రూపాయలు పొందవచ్చు. మరి షూరిటీ ఏంటి అంటారా? ఇది గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్. ఇంతకన్నా షూరిటీ ఏం కావాలి. మరి ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి? షరతులు ఏంటి? అనేది చూద్దామా..

రిటైర్మెంట్ Retirement తర్వాత ఆర్ధిక కష్టాలు అస్సలుండొద్దు అని ప్లాన్ చేసే వారికోసం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దీన్నే ఏపీవై స్కీమ్ APY అని కూడా అంటారు. ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్లకు మంచి రాబడి రావడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో చేరి డబ్బు పొదుపు చేయడం వల్ల పదవీ విరమణ తర్వాత ప్రతి నెల కొంత సొమ్ము పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 60 ఏళ్ల వరకు ప్రతి నెల ఈ పథకంలో పొదుపు చేస్తుండాలి. ఆ తర్వాత పెన్షన్ రూపంలో ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి. 1000, 2000, 3000, 4000, 5000 వేలు ఇలా పెన్షన్ పొందొచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉంటే చాలు కామన్ సర్వీసె సెంటర్‌కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు.

పెన్షన్ రూపంలో నెలకు 5 వేలు (ఏడాదికి రూ. 60 వేలు) పొందాలని అనుకుంటే ఇప్పుడు నెలకు 210 రూపాయలు కడుతూ వెళ్లాలి. అంటే రోజుకు 7 పొదుపు చేస్తే చాలు. పద్దెనిమిదేళ్ల వయసులో చేరి 60 ఏళ్ల వరకు డబ్బులు కట్టాలి. వయసు పెరిగే కొద్ది చెల్లించాల్సిన మొత్తం కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తుంది. తక్కువ పెన్షన్ కావాలనుకుంటే అప్పుడు నెలవారీ ఇన్వెస్ట్మెంట్ కూడా కూడా తక్కువగానే ఉంటుంది.

Example: నెలకు 42 డిపాజిట్ చేస్తే అప్పుడు మీకు నెలకు 1000 పెన్షన్ వస్తుంది. 2 వేలు పొందాలని అనుకుంటే నెలకు 84 రూపాయలు కడుతూ రావాలి. 3 వేల పెన్షన్ కోసం నెలకు 126 రూపాయలు కట్టాలి.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img