Monday, September 26, 2022

IPL2022: ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై చెత్త రికార్డు.. ధోనీ ఉన్నా తప్పలేదుగా!

Must Read

క్రికెట్ ప్రియులకు దాదాపు రెండు నెలల పాటు మజాను పంచుతూ సాగే ఖరీదైన లీగే ‘ఐపీఎల్’. 2008 సంవత్సరంలో బీసీసీఐ ప్రారంభించిన ఈ లీగ్.. ప్రతి ఏడాది సాగుతూ 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవలే 15వ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో మొత్తం పది జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. భారీ ఆక్షన్ తర్వాత జట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే, అందరి దృష్టి మాత్రం డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మీద పడింది. దీనికి కారణం ఈ సారి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే.

ధోనీ నాయకత్వం నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను టీమిండియా మరో క్రికెటర్ రవీంద్ర జడేజాకు అప్పగించారు. దీంతో గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఈ సీనియర్ ప్లేయర్ల జట్టు సత్తా చాటుతుందని అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ సీఎస్‌కే ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్త రికార్డును ఈ జట్టు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ చెన్నై టీమ్ మొదటి రెండు మ్యాచ్‌లను ఓడిపోలేదు. కానీ, ఈ సారి మాత్రం ఏకంగా మూడింటిలో పరాజయం పాలైంది. ఫలితంగా చెడ్డపేరును కూడా మూటగట్టుకుంది.

రవీంద్ర జడేజా కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ అంచనాలతో ఐపీఎస్ సీజన్‌ను ప్రారంభించింది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో సీఎస్‌కే.. కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌ను కూడా ఆరు వికెట్ల తేడాతో కోల్పోయింది. ఇక, ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో పోటీ పడిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.. ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా చెత్త రికార్డుతో పాటు పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌కు చేరింది.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img