Monday, September 26, 2022

చీపురును ఇలా వాడుతున్నారా? అయితే, మీరు అప్పులపాలు కావడం ఖాయం!

Must Read

సాధారణంగా ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు కట్ట (Broom)ను వాడడం మన ఆనవాయితీ. పల్లెల నుంచి పట్టణాల వరకూ దీన్నే అందరూ ఉపయోగిస్తుంటారు. అయితే, చీపురు కట్ట వాడకం పైన ఎన్నో అంశాలు ప్రభావితమై ఉంటాయన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే దీన్ని ఎలా పడితే అలా వాడుతూ.. దీనితో ఏది పడితే అది చేస్తూ ఉంటారు. మరి చీపురు కట్టను ఎలా వాడుకుంటే మనకు మేలు జరుగుతుంది? దీనితో ఏఏ పనులు చేస్తే కీడు సంభవిస్తుంది? అనే విషయాలపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఓ లుక్కేద్దాం పదండి.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వాడే చీపురు కట్ట విరిగితే దాన్ని వాడడం మానేయాలట. కొంత మంది విరిగినా దాన్ని సర్ధుబాటు చేసుకుని మళ్లీ మళ్లీ వాడుతుంటారు. అలాంటి పని చేయడం వల్ల ఇంట్లో చెడు జరిగే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, ఇంట్లో చీపురు కట్టను వాడుకున్న తర్వాత దాన్ని చాలా మంది ఏదో ఒక మూల గొడవకు నిలబెడుతూ ఉంటారు. అలా చేయడం కూడా శ్రేయస్కరం కాదని అంటున్నారు వాస్తు సిద్ధాంతులు. ఈ పని చేయడం ఇంటికే అశుభం అని చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా సాయంత్రం అంటే ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత చీపురు కట్టను అస్సలు పట్టుకోకూడదట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల సాక్షాత్ లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తు శాస్త్రం భోదిస్తుంది. అందుకే సాయంత్రం, లేదా రాత్రి సమయంలో ఇల్లు ఊడవకూడదట. ఒకవేళ ఊడ్చినా, చెత్తను అప్పుడు కాకుండా ఉదయాన్నే పడేయాలట. ఇలా చేస్తే లక్ష్మీదేవి కరుణించని సిద్ధాంతులు చెబుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చీపురును డబ్బు ఉన్న ప్రాంతాల్లో పెట్టకూడదట. అలా చేస్తే అప్పులపాలు అవడం ఖాయమని వాస్తు శాస్త్రం వివరిస్తోంది.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img