Monday, September 26, 2022

ఈ మొక్క ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఇలా చేయండి!

Must Read

భూమి మీద పుట్టిన ప్రతి జీవి మనుగడు అర్థం పరమార్థం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని మొక్కలకు విశిష్టమైన శక్తులు ఉంటాయని శాస్త్రియపరంగా కూడా రుజువైంది. వాస్తు శాస్త్రం పరంగా కూడా కొన్ని మొక్కలకు విశేషమైన శక్తులు ఉంటాయని తేటతెల్లమైంది. అందుకే ప్రతి ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకోవాలని, కొన్ని రకాల వాటిని అస్సలు ఉంచకూడదని వాస్తు సిద్దాంతులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బందులు పడే వాళ్లు ఇంట్లో ఒక మొక్క నాటడం వల్ల కష్టాల నుంచి బయటపడతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ప్రతి ఒక్కరూ మంచిగా సంపాదించి ధనవంతులు కావాలని కోరుకుంటూ ఉంటారు. మరికొందరు అప్పుల బాధలు తీరిపోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు లక్ష్మణ మొక్క (Lakshmana Plant)ను ఇంట్లో పెంచుకుంటే దారిద్ర్యం దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుందట. అంతేకాదు, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందట. దీని వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి నాశనం అవడంతో పాటు ఆ కుటుంబం ఆర్థికంగా మెరుగు పడడడంతో పాటు తక్కువ సమయంలోనే ధనవంతులు అవుతారని హిందూ శాస్త్రం చెబుతుంది.

లక్ష్మణ మొక్కను ఇంట్లోని ఉత్తర దిశలో నాటుకోవాలట. దీనికి కారణం సంపదకు దేవుడు అయిన కుబేరుడు కూడా ఈ దిశకు సంబంధించినవాడు కావడమేనట. ఈ దిక్కున లక్ష్మణ మొక్కను నాటితే ఇంట్లో ధనం వస్తూనే ఉంటుంది. దీంతో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ మొక్కను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా మాయమవుతాయట. అందుకే దీనిని లక్ష్మణ్ బూటీ అని పిలుస్తారు. కాబట్టి ఈ మొక్క కనుక మీ ఇంట్లో లేకపోతే వెంటనే తెచ్చి నాటేయండి.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img