Monday, September 26, 2022

TVS Jupiter ZX: వాయిస్‌తో పని చేసే స్కూటీ వచ్చేసింది.. ఊహించని ధరకే!

Must Read

కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో రకరకాల వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడు టెక్నాలజీతోనే అనుసంధానం అవుతూ వస్తోంది. దీంతో చాలా వాహనాలు ఊహించని ఫీచర్లతో తయారు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ మోటార్ కంపెనీ టీవీఎస్ వాయిస్‌తో పని చేసే స్కూటీని తయారు చేసింది. టీవీఎస్‌ జుపిటర్‌ జెడ్‌ఎక్స్‌ (TVS Jupiter ZX) అనే పేరుతో వచ్చిన ఈ ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇంత కాలం బ్లూటూత్‌తో అనుసంధానం అయిన వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఇండియాలోనే తొలిసారి టీవీఎస్ కంపెనీ బ్లూటూత్‌ కనెక్టివిటీ ఫీచర్‌తో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. పూర్తిగా డిజిటల్ కన్సోల్, నావిగేషన్ అండ్ వాయిస్ అసిస్ట్ ఫీచర్ వంటి ఫీచర్లతో వస్తోంది. 110 సీసీ ఇంజన్‌తో వచ్చిన ఈ స్కూటర్ ద్వారా SMARTXONNECTTM ఫీచర్ పూర్తిగా డిజిటల్ కన్సోల్, వాయిస్ అసిస్ట్, నావిగేషన్ అసిస్ట్, టెక్-అవగాహన ఉన్న కస్టమర్‌లకు అందించడానికి ఎస్‌ఎం‌ఎస్/కాల్ అలర్ట్‌ల వంటి అదనపు ఫీచర్‌లతో పరిచయం చేశారు.

రెండు రోజుల క్రితమే టీవీఎస్‌ జుపిటర్‌ జెడ్‌ఎక్స్‌ (TVS Jupiter ZX) సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో అందుబాటులో ఉండే జుపిటర్‌ స్మార్టెక్సానెక్ట్‌ ధర ఢిల్లీ నగరంలో రూ.80,973 పలుకుతున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో ఈ ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక, ఇండియాలోనే మొట్టమొదటి బ్లూటూత్ స్కూటర్ కావడంతో అప్పుడే కస్టమర్లు దీనికోసం ఎగబడుతున్నట్లు టీవీఎస్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img