Monday, September 26, 2022

మహిళలు గుడిలో సాష్టాంగ నమస్కారం చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Must Read

భారతదేశంలో దైవభక్తి అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అందుకే ఇండియాలో దేవుడి ఆరాధన అనేది చాలా పవిత్రమైన అంశం. మరీ ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఉన్న భూభాగం కావడంతో ఇక్కడ ఆధ్యాత్మికత ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ఒకలా దేవుడిని ఆరాధిస్తుంటారు. ఎక్కడైనా హిందూ ధర్మంలో కొన్ని విషయాలను మాత్రం అందరూ పాటిస్తుంటారు. అలాంటి వాటిలో ఆలయంలోకి ప్రవేశించిన స్త్రీలు దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అనే రూల్ ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ ధర్మం ప్రకారం.. నమస్కారాలు కూడా పలు రకాలుగా ఉన్నాయి. అందులో పురుషులు ఒకలా.. మహిళలు మరోలా దేవుడికి నమస్కారాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా గుడిలోకి వెళ్లిన మహిళలు మాత్రం కచ్చితంగా సాష్టాంగ నమస్కారం మాత్రం చేయకూడదట. దీనికి కారణం.. స్త్రీలు అమాంతం పడుకుని నమస్కారం చేయడం వల్ల ఉదరం (పొట్ట), వక్షోజాలు నేలకు తాకుతాయి. మహిళ దేహంలో ఎంతో పవిత్రమైన, సున్నితమైన భాగాలు కావడంతో వాటికి ఏదైన జరిగే ప్రమాదం ఉందనే ఈ నిబంధనను పెట్టారని పండితులు చెబుతారు.

అంతేకాదు, హైందవ ధర్మంలో స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత, గొప్పదనం ఉంది. అందుకే సృష్టికి కారణం అయిన.. అవసరం అయిన మహిళ శరీర భాగాలు నేలకు తాకకూడదు అన్న కారణంతోనూ సాష్టాంగ నమస్కారం చేయొద్దని పెద్దలు చెబుతారు. ఇక, హిందూ శాస్త్రాల ప్రకారం.. గుడిలోకి ప్రవేశించిన ఆడవాళ్లు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలట. దీని అర్థం ఏమిటంటే.. స్త్రీలు మోకాళ్లపై కూర్చుని చేతులు, నుదురు నేలకు ఆనించి దండం పెట్టుకోవాలన్న మాట. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని పెద్దవాళ్ల భావన.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img