Monday, September 26, 2022

బెడ్‌రూంలో భార్య భర్తలు ఎలా పడుకోవాలి? ఈ తప్పు చేస్తే అంతే సంగతులు

Must Read

భారతదేశంలో వాస్తు శాస్త్ర ప్రభావం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు పుట్టడం నుంచి.. మృతదేశాన్ని ఖననం చేసే వరకూ హిందూ ధర్మంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే, ఆర్థిక స్థితిగతులను పెంపొందించుకోవడం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుందని ఎంతో మంది సిద్ధాంతులు చాలా కాలంగా ఎన్నో ఉదాహరణలతో కూడిన అంశాలను ప్రస్థావిస్తున్నారు. అందుకే వాస్తు శాస్త్రాన్ని ఇండియాలో నమ్మే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో అసలు బెడ్‌రూం ఎలా ఉండాలో తెలుసుకుందాం పదండి.

సాధారణంగా ఇల్లు కట్టేటప్పుడే బెడ్‌రూం ఏ దిశలో ఉండాలి? ఎలా ఉండాలి? అనే అంశాలను వాస్తు సిద్ధాంతులు సూచిస్తారు. మరి అందులో బెడ్‌ను ఎలా వేసుకోవాలి అంటే దీనికి కూడా సమాధానాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. పడకగది ఇంటికి ఉత్తర దిశలో ఉండాలి. అంతేకాదు, మంచం గదికి మధ్యలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి కనిపిస్తుందట. అలాగే, బెడ్‌రూంలో ఏర్పాటు చేసుకున్న మంచానికి సంబంధించిన తల భాగం తూర్పు లేదా దక్షిణ దిశలో ఉండాలి అని వాస్తు సిద్దాంతులు సూచిస్తున్నారు.

బెడ్‌రూంలో మంచమే కాదు.. మనం నిద్రిస్తే స్థితిపైనా ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయట. వాస్తు ధర్మం ప్రకారం.. నిద్రించే స్థానం దక్షిణం లేదా పడమర ఉండాలి. అంటే లేచిన వెంటనే తూర్పు, ఉత్తరం దిక్కులు చూసేలా నిద్రపోవాలట. ఇక, బెడ్‌ మీద భార్య తన భర్తకు ఎడమ వైపున నిద్రపోవాలి. అప్పుడు వారి మధ్య సామరస్యపూర్వక సంబంధం పెరుగుతుంది. అంతేకాదు, వాళ్లకు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయట. ఇది చాలా మంది పాటించరు. అందుకే తరచూ మానసిక క్షోభకు గురి అవుతుంటారని వాస్తు శాస్త్రాన్ని చదివిన వాళ్లు అభిప్రాయపడుతుంటారు.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img